Header Banner

రేషన్ కార్డులు పొందాలంటే అది తప్పనిసరి! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

  Sun May 04, 2025 11:46        Politics

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు కొనసాగుతోంది. లక్షలాది మంది లబ్దిదారులు కొత్త కార్డుల జారీతో పాటుగా.. పేర్ల చేర్పుల కోసం వేచి చూస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావటంతో లబ్ది దారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసారు. కాగా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ముందే కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.


గడువు పెంపు

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ది దారులకు కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్‌కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్.. కార్డుల జారీకి ముందు రేషన్‌కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్‌ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. అయినా, పూర్తి స్థాయిలో లబ్ది దారులు ఈ కేవైసీ పూర్తి చేయ లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ కేవైసీనీ చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆ గడువు లోపు ఈకేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి:  జైలులో ఆ నోటి దూల మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

తప్పని సరి

కొత్త కార్డుల జారీకి ముందే ఈ కేవైసీ పూర్తి చేయటంతో పాటుగా. .బోగస్ కార్డుల ఏరివేత పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తూ.. ఆలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు ప్రకటనలు ఇచ్చారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఈ కేవైసీని చేసుకునే విధానాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చారు. దీంతో, లబ్దిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మరో రెండు నెలల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల కారణంగా కార్డులో పేరున్నా.. చాలా మంది విద్యార్థులు వేరే ప్రాంతాల్లో ఉంటూ చదువకోవడం వల్ల కూడా వారు ఈ కేవైసీని చేసుకోలేకపోయారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈకేవైసీ చేసుకునేందుకు గడువు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా జూన్ 30 వరకు ఈకేవైసీ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.


ఇది కూడా చదవండి:  ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APGovernment #RationCardUpdate #MandatoryRationCard #AndhraPradeshNews #GovernmentAnnouncement #WelfareSchemes